హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తి కిడ్నాప్ రూ.10 లక్షలు డిమాండ్our Title

నలుగురు నిందితులను అరెస్టు చేసిన సీఐ నరేష్, దోమకొండ ఎస్సై ప్రభాకర్

హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తి కిడ్నాప్  రూ.10 లక్షలు డిమాండ్our Title

  - పాత్రికేయుల సమావేశంలో వివరాలు                                   
 వెల్లడించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,
కామారెడ్డి బ్యూరో : కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేష్ (32) వరి కోత హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకొని నడుపుకుంటూ  జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డి అనే పేరుతో వ్యక్తి పరిచయం చేసుకొని అతని  హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తానని నమ్మించినాడని  తేదీ 22- నవంబర్ -2026న రాత్రి మాట్లాడుదాం అని పిలిచి కారులో కిడ్నాప్ కు, మార్గమధ్యలో మరో ఇద్దరితో కలిసి బాధితుడి ముఖానికి ఉన్ని టోపీ ని మాస్క్ ల  వేసి, దాడి చేసి, చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న  పి ఓ సి ఓ, ఎం5 జి సెల్‌ఫోన్, పర్సులోని రూ.2,500 నగదును బలవంతంగా లాక్కున్నారని  నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధితుడు ఇందల్వాయి బస్‌స్టాండ్‌కు చేరుకొని తన గ్రామస్థులకు సమాచారం అందించి, అక్కడి నుండి దోమకొండకు వచ్చి  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించి నట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సోమవారం ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన వివరాలు వెల్లడించారు. ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ  మధుసూదన్  పర్యవేక్షణలో భిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్  నరేష్, దోమకొండ ఎస్ ఐ ప్రభాకర్ సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.  దర్యాప్తులో బాధితుడు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ కెమెరాల పరిశీలన, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలని వేగవంతం చేశారు. 
- కేసు వివరాలు ఇలా ఉన్నాయి...
నిందితులు నిట్టూ  నరసింగ  రావు కు ఎరుగు నగేష్, చిందం శ్రీకాంత్ గతంలో జైలులో ఉన్న సమయంలో ఒకరికొకరు పరిచయమై,  జైలు నుంచి విడుదలైన అనంతరం సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం రూపొందించుకున్నారు. ఈ క్రమంలో చిందం శ్రీకాంత్‌కు పరిచయమున్న కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేష్‌ అనే వ్యక్తి దగ్గర  డబ్బు, వ్యవసాయం  అతనిని  లక్ష్యంగా ఎంచుకున్నారు. మహేష్ హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకొని నడుపుతాడని తెలుసుకొని అదే అదనుతో అతనికి హార్వెస్టర్ మిషన్లు అద్దెకు ఇస్తామని నమ్మించి అతడిని కిడ్నాప్ చేసి అదిక మొత్తములో డబ్బు  వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. 
ఇందులో భాగంగా నిట్టూ నర్సింగరావు కరుణాకర్ రెడ్డి అనే నకిలీ పేరుతో, దొరికిన సిమ్ కార్డ్ ఉపయోగించి సుమారు నెల రోజుల పాటు మహేష్‌తో మాట్లాడి హార్వెస్టర్ మిషన్లు అద్దెకు ఇస్తామని నమ్మించాడు. మరోవైపు నిందితులు ముందుగానే బాధితుడి ఇంటి పరిసరాలు, రాకపోకల మార్గాలను పరిశీలించి పతకం ప్రకారం  తెల్లరంగు మారుతి ఎర్టిగా కారును అద్దెకు తీసుకున్నారు. ఈ పథకంలో ఎరుగు నగేష్, నిట్టూ నర్సింగరావు, తెడ్డూ సురేష్ ప్రత్యక్షంగా పాల్గొనగా, చిందం శ్రీకాంత్ గ్రామంలోనే ఉండి బాధితుడి కుటుంబ సభ్యుల కదలికలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాలను గమనిస్తూ వారికి సమాచారం అందించే బాధ్యత తీసుకున్నాడు. 
తేదీ 22-10-2026న నిందితులు కారులో కోనాపూర్ గ్రామానికి చేరుకొని, హార్వెస్టర్ మిషన్లు చూపిస్తామని చెప్పి మహేష్‌ను వారి దగ్గరకు పిలిచి నమ్మించి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు.  కొంతదూరం వెళ్లిన తర్వాత  ఉన్ని టోపీని మాస్క్‌లా ఏమి కనపడకుండా తొడిగి కాళ్లతో తన్నుతూ, చేతులతో కొడుతూ రూ.10 లక్షలు ఇవ్వాలని  లేదంటే చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న POCO M6 5G సెల్‌ఫోన్, పర్సు, అందులోని రూ.2,500 నగదును బలవంతంగా లాక్కొని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ, బయపెడ్తూ, దాడి చేస్తూ  డబ్బులు తెప్పించాలని ఒత్తిడి చేశారు. 
అయితే నిందితులు మద్యం సేవించి, ఇందల్వాయి ఒక దభ హోటల్ వద్ద కారు నిలిపి నిద్రలోకి జారుకున్న సమయంలో బాధితుడు వారి చెర నుంచి తప్పించుకొని బస్‌స్టాండ్‌కు చేరుకున్నాడు. ఈ ఘటన అనంతరం నిందితులు తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఫోన్ చేసి తాము బీహార్‌కు చెందిన వారమని, బాధితుడు తమ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందున అతడిని తీసుకెళ్లి బెదిరించి వదిలిపెట్టామని తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను, గ్రామస్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా, బాధితుడు మొదటిసారి కిడ్నాప్ సమయంలో తీవ్ర భయాందోళనకు గురై తనకు ఆడ పిల్లలు ఉన్నారని తనకు హాని చేయ వద్దు ఎంతైనా డబ్బులు ఇస్తానని చెప్పినందున, అతడిని మరోసారి కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని నిందితులు మరో సారి పథకం వేశారు. తేదీ 09-నవంబర్-2026న  కారును అద్దెకు తీసుకొని కోనాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద ఉండగా పోలీసులు కారును అనుమానించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగ వారు చేసిన కిడ్నాప్, దోపిడి బయటపడింది.  
నిందితుల పూర్తి వివరాలు  
ఎ-1: నిట్టూ నర్సింగరావు, తండ్రి :నాగేందహార్ రావ్, చిట్యాల గ్రామం, తాడ్వాయి ( 3 కేసులు, తాడ్వాయి పి యస్  పరిధిలో 1) భూ వివాదం, 2) హత్యాయత్నం ,పేలుడు పదార్థాల కేసు, 3)  కిడ్నాప్ ,ఆయుధాల చట్టం కేసు                                                                   ఎ-2: ఎరుగు నగేష్ అలియస్ నాయేష్, తండ్రి : మహేందర్, గన్నారం గ్రామం, ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా (ఇందల్వాయి పియస్ పరిధిలో తన 9 నెలల గర్భవతి  భార్యను హత్య చేసిన కేసు ఉంది.)                                                     ఎ-3: తెడ్డూ సురేష్, తండ్రి : బాబయ్య, గన్నారం గ్రామం, ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా(మెదటి నేరం)                                     
 ఎ-4: చిందం శ్రీకాంత్, తండ్రి : మల్లయ్య, కోనాపూర్ గ్రామం, బీబీపేట మండలం. )దోమకొండ PS పరిధిలో దొంగతనం కేసు కలదు.(
 స్వాధీనం చేసుకున్న వస్తువులు
1. తెల్లరంగు ఇర్టిగా కార్ (టీఎస్16 ఈ ఎఫ్  8889) 
2. సెల్‌ఫోన్ – బాధితుడి నుంచి అపహరించినది మరియు (4) నిందితుల సెల్‌ఫోన్స్ 
3. బాధితుడి ముఖానికి మాస్క్ ల ఉపయోగించిన ఉన్ని టోపీ.   4. ఒక ద్విచక్ర వాహనం. ఈ కేసును ఛేదించడంలో చురుకుగా పనిచేసిన భిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్  నరేష్, దోమకొండ ఎస్‌ఐ ప్రభాకర్  కానిస్టేబుల్ సాయిబాబా , బాలకృష్ణ, బైరవప్రసాద్, హోం గార్డ్ శ్రీకాంత్  లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం
తిరుపతి :  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు
చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి..!
సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి..!