తీన్మార్ మల్లన్నపై జరిగిన ప్రమాదం కుట్రపూరిత చర్యగా అనుమానం – తీవ్రంగా ఖండించిన BC JAC జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బ కరుణాకర్ ముదిరాజ్
బిజినపల్లి : తీన్మార్ మల్లన్నపై జరిగిన ప్రమాదాన్ని కుట్రపూరిత చర్యగా అనుమానిస్తూ BC JAC నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బ కరుణాకర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి బిజినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తీన్మార్ మల్లన్నపై జరిగిన ప్రమాదం వెనుక వాస్తవాలను వెలికితీసి, దోషులకు చట్టపరంగా తగిన శిక్ష విధించాలని పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు. ప్రజా నాయకులపై ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని, ఈ విషయాన్ని పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని అబ్బ కరుణాకర్ ముదిరాజ్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

