స్వర్ణకవచాలంకరణలో నిమిషాంబ అమ్మవారు...

బోడుప్పల్ (మేడ్చల్) : శరన్నవరాత్రుల తొలిరోజు బోడుప్పల్‌లోని శ్రీ మాతా నిమిషాంబ దేవి స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సామూహిక చండీ హోమం నిర్వహించారు. తొలిసారిగా నిమిషాంబ మాలధారణ దీక్షను ప్రారంభించి, ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ భక్తులకు మాలలు ధరింపజేశారు. ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్‌కుమార్, ట్రస్ట్ ప్రతినిధులు, అర్చకులు పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Oct 2026 16:44:27
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్
పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
