కాంధనూల్ జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలి

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ సెలక్షన్స్... జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్

కాంధనూల్ జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలి

నాగర్‌కర్నూల్ :  నాగర్‌కర్నూల్‌లో 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ - 2026కు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందనూలు జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని అన్నారు. సరైన ప్రోత్సాహం, నిరంతర సాధనతో క్రీడాకారులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు మంచి వేదిక కల్పించేందుకు అథ్లెటిక్స్ అసోసియేషన్ నిరంతర కృషి చేస్తోందని ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించవచ్చని సూచించారు. సెలక్షన్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. డిసెంబర్ 6న నారాయణపేట జిల్లాలో 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ - 2026 జరగనుంది. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్‌లు, పీఈటీలు, క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి రైతు భీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి
హుస్నాబాద్ :  తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా...
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి:
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిన కోయిలకొండ ‎ ‎
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ‎
అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
సీజ్ వాహనాల ప్రతి భాగాన్ని రెండుగా విడదీసే వేలం వేయాలి