ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

ఏబీవీపీ ఆధ్వర్యంలో  ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

పాలెం(నాగర్ కర్నూల్) :  బిజినపల్లి మండలం ABVP పాలెం శాఖ ఆధ్వర్యంలో భారతదేశ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ABVP పాలెం శాఖ నగర కార్యదర్శి విష్ణు నాయుడు మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ సమైక్యతకు పటిష్టమైన పునాది వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ABVP కార్యకర్తలు జహంగీర్, ఆకాష్, చందు, బన్నీ, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు. నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.
నల్లగొండ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు ప్రభుత్వం రూ.197.44 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు నగర మేయర్ బుర్రి చైతన్య...
ఇందిరా గాంధీ గారి ఆశయాలు, త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం – డాక్టర్ నరేష్ జాదవ్ గారూ
సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
సింగరేణి సెక్యూరిటీ సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ శిక్షణ పూర్తి
*రిమ్స్‌లో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..... జిల్లా కలెక్టర్ రాజర్షి షా
రేపే ప్రారంభం కానున్న ఎస్‌ఎల్‌ఎన్ సౌభాగ్య ప్రీమియా వెంచర్
నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల