*ఘనంగా భారత ఉక్కుమనిషి జయంతి వేడుకలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో, కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవం. భారతదేశ ఐక్యత సమగ్రత భద్రతను కాపాడుతానని జిల్లావ్యాప్తంగా ప్రతిజ్ఞ చేసిన సిబ్బంది.
ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నందు నివాళులర్పించిన పోలీసు అధికారులు సిబ్బంది.*
ఆదిలాబాద్ బ్యూరో : శనివారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో భారతదేశపు మొదటి హోం మంత్రి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ 151వ జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పూలతో సత్కరించి జాతీయ ఐక్యత దినోత్సవం (ఏక్తా దివస్) గా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రానంతన ఏకీకృత దేశంగా రూపొందించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అనిర్వచనీయమైనదని కొనియాడారు. భారతదేశ సార్వభౌమత్యం ఐక్యతను కాపాడే క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనను భారతదేశపు ఉక్కుమనిషిగా నిలిపాయని తెలిపారు. అసమాన పోరాట ప్రతిమ ఉన్న స్వతంత్ర భారత యోధుడిగానే కాకుండా భారత దేశంలోని మొదటి హోం మంత్రిగా పనిచేసే స్వతంత్ర భారత దేశానికి సేవలందించారు. దేశంలోని అనేక సమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించిన పటేల్ ఐక్యత భావనను ప్రతీకగా నిలిచారని ఇటువంటి మహనీయులను మనమంతా ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో, కార్యాలయాల్లో ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞను చేశారు. అందులో భాగంగానే పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఐక్యత దినోత్సవం ప్రతిజ్ఞను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో సహా, అధికారులందరూ చేసి జిల్లా ముఖ్య కార్యాలయ సిబ్బంది మరియు రిజర్వ్ సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొని అనుసరించారు. ఈ ప్రతిజ్ఞలో భారత దేశ ఐక్యత సమగ్రత భద్రతను కాపాడుతానని సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనీయత మరియు చర్యల వల్ల సాధ్యమైన నా దేశాన్ని ఏకీకృతం చేయాలనే స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నానని, భారతదేశం యొక్క అంతర్గత భద్రతను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటానని గంభీరంగా నిర్ణయించుకుంటున్నాను అని ప్రతిజ్ఞ . ఈ కార్యక్రమంలో పోలీస్ ముఖ్య కార్యాలయం ఏవో శివకుమార్, సూపరిండెంట్లు సులోచన, సంజీవ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ నైలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు గోపికృష్ణ, గబ్బర్ సింగ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


