తెలంగాణలో కే2 జెనాక్స్ విస్తరణకు వేగం ఏడాదిలో టీఎంటీ బార్ల ఉత్పత్తి సామర్థ్యం 15 శాతం పెంపు
డీలర్లు, పంపిణీ నెట్‌వర్క్‌ను 10 శాతం విస్తరించేందుకు ప్రణాళిక మేసన్లు, బిల్డర్లతో ప్రత్యేక సమావేశాల నిర్వహణ కే2 జెనాక్స్ డైరెక్టర్ సునీల్ అగర్వాల్
హైదరాబాద్, : తెలంగాణలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో స్టీల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు కే2 జెనాక్స్ సంస్థ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది కాలంలో టీఎంటీ బార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 15 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే బలమైన డీలర్లు, పంపిణీ వ్యవస్థను మరో 10 శాతం విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం మేసన్లు, బిల్డర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే కే2 జెనాక్స్ దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో గణనీయమైన గుర్తింపు సాధించిందని తెలిపారు. ఆధునిక నిర్మాణ రంగ అవసరాలు, నూతన డిజైన్ విధానాలకు అనుగుణంగా తమ ప్రీమియం టీఎంటీ బార్లను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్మాణ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ మార్కెట్ పరిధిని మరింత పెంచడంతోపాటు, మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన నిర్మాణ సామగ్రిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని వెల్లడించారు.కే2 టీఎంటీ బార్ల ప్రీమియం బ్రాండ్‌గా కే2 జెనాక్స్ ప్రత్యేకమైన రిబ్ డిజైన్‌తో రూపొందించిన స్టీల్‌ను అందిస్తోంది. ఈ ప్రత్యేక డిజైన్ కాంక్రీట్‌తో మెరుగైన బంధాన్ని ఏర్పరచి నిర్మాణాలకు పటిష్టమైన పునాదిని అందిస్తుందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణాలకు అవసరమైన బలం, మన్నికను అందించేలా వీటిని తయారు చేస్తున్నట్లు పేర్కొంది.
ఇందులోని ప్రత్యేకమైన 720 డిగ్రీల హెక్సాగనల్ డిజైన్, మెష్ గ్రిప్ సాంకేతికత కాంక్రీట్‌తో మెరుగైన అనుసంధానాన్ని కల్పిస్తాయని వెల్లడించింది. సాధారణ బాండింగ్ సామర్థ్యంతో పోలిస్తే 200 శాతం అధిక బాండ్ స్ట్రెంత్ కలిగి ఉండటం ఈ ఉత్పత్తి ప్రత్యేకతగా పేర్కొంది. అధిక ఒత్తిడిని తట్టుకునే భౌతిక, రసాయన లక్షణాలతో ఆధునిక నిర్మాణ అవసరాలకు అనువుగా ఉంటుందని తెలిపింది.అత్యున్నత నాణ్యత కలిగిన Fe 500, Fe 500D గ్రేడ్‌లతో తయారయ్యే ఈ టీఎంటీ బార్ల వినియోగం ద్వారా నిర్మాణాల్లో 20 శాతం వరకు స్టీల్ ఆదా చేయవచ్చని కంపెనీ పేర్కొంది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా స్థిరమైన నాణ్యతను అందిస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ మార్కెట్లో మరింత విస్తరించి నిర్మాణ రంగానికి నాణ్యమైన స్టీల్‌ను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ తెలిపింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

