అంబర్‌పేటలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

72 అడుగుల మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు

అంబర్‌పేటలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు అంబర్‌పేటలో ఘనంగా జరిగాయి. శనివారం (అక్టోబర్ 17) అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు పాల్గొని బతుకమ్మ పాటలు, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.ఈ వేడుకలకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి నాయకత్వం వహించగా, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ సతీమణి జానకి శుక్లా, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుకల్లో 72 అడుగుల ఎత్తుతో వివిధ రకాల పూలతో పేర్చిన మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ పూల బతుకమ్మ చుట్టూ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, మహిళల ఆత్మగౌరవం, ప్రకృతితో మమేకమయ్యే సంప్రదాయానికి ప్రతీక అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పండుగను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను స్వాగతించాలని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అంబర్‌పేటలో జరిగిన ఈ వేడుకలు తెలంగాణ పూల పండుగ వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య