తిలక్ గ్రౌండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
యువత క్రీడల్లో రాణించాలి: స్వామి
బెల్లంపల్లి మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్‌లో బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించారు నియోజకవర్గంలోని వివిధ మండలాల జట్ల మధ్య నిర్వహిస్తున్న ఈ పోటీలను టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, వన్‌టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రేగుంట రాజలింగు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడలపై కూడా దృష్టి సారించి ప్రతిభను నిరూపించుకోవాలని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ టోర్నమెంట్‌లో వివిధ మండలాలకు చెందిన క్రికెట్ జట్లు పాల్గొని పోటీపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడం, క్రీడలను ప్రోత్సహించడం లక్ష్యంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు వంశీ, సాయిరాం, అనీష్, తహర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

