బొక్కలవాగు ప్రాజెక్టులో భారీ చేపలు
20 కిలోల బొచ్చె చేప రూ.5 వేలకు విక్రయం.. ఆరు క్వింటాళ్ల చేపల వేట
బెల్లంపల్లి : (మంచిర్యాల జిల్లా) నెన్నెల మండలం నందులపల్లి సమీపంలోని బొక్కలవాగు ప్రాజెక్టులో మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కాయి. ఒక్కో చేప 10 నుంచి 20 కిలోల బరువు ఉండటంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచెర్ల సాయి అనే మత్స్యకారుడి వలకు 20 కిలోల బరువున్న బొచ్చె చేప చిక్కగా, దానిని రూ.5 వేలకు విక్రయించారు.
అదేవిధంగా కంపెల మల్లేశ్, మేడి సంపత్, బింగి భీమేశ్‌తో పాటు ఇతర జాలర్ల వలలకు 16 కిలోల బరువున్న మరో నాలుగు భారీ చేపలు చిక్కాయి. ఒకేసారి ఇన్ని పెద్ద చేపలు వలకు చిక్కడం ఇదే తొలిసారని మత్స్యకారులు తెలిపారు. బొచ్చె, రవు, మెరిగె రకాల చేపలు కలిపి సుమారు ఆరు క్వింటాళ్ల వేట సాగినట్లు వెల్లడించారు.భారీ చేపలను చూసేందుకు కొనుగోలుదారులు, స్థానికులు ప్రాజెక్టు వద్దకు తరలివచ్చారు. పలువురు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారీగా చేపలు లభించడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

