చింతకుంటలో మృతుని కుటుంబానికి రిటైర్డ్ ఎస్సై బంగరిగల్ల మల్లయ్య ఆర్థిక సాయం

చింతకుంటలో మృతుని కుటుంబానికి రిటైర్డ్ ఎస్సై బంగరిగల్ల మల్లయ్య ఆర్థిక సాయం

అందోల్ :  అందోల్ మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన మంగలి బేతయ్య అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న చింతకుంట గ్రామానికి చెందిన బంగరిగల్ల మల్లయ్య (రిటైర్డ్ ఎస్సై) వెంటనే స్పందించి, మృతుని నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా మంగలి బేతయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తాము ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి నివాళులర్పించారు.
అనంతరం గ్రామంలో కొద్దిసేపు ఉండి చుట్టుపక్కల నివాసులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ నా వంతుగా నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ అండగా ఉంటాను. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, గ్రామంలో అందరూ సమానమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో
బంగరిగల్ల మల్లయ్య, బి. గోపాల్, చాకలి మొగులయ్య, బి. వెంకయ్య, మంగలి దుర్గయ్య, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, చాంద్ పాషా, ఎం. శ్రీనివాస్ మాజీ వార్డు మెంబర్, మరిపల్లి యాదగిరి, గుండెగల్ల మల్లయ్య (రిటైర్డ్ ఆర్టీసీ) తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం
నాంపల్లి :  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఏడో...
కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం