బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

సిపిఐ నేత దుబాస్ రాములు డిమాండ్......

బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం కరువు ప్రకటించాలని మంగళవారం సిపిఐ నేత దుబాస్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాన్సువాడ పట్టణంలోని సిపిఐ కార్యాలయం ప్రక్కన ఉన్న నాయి బ్రాహ్మణ ఫంక్షన్ హాల్ లో సిపిఐ అనుబంధ కార్మిక సంఘాల సభ్యుల తో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భం గా సిపిఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా సహాయ కార్యదర్శి దుబాస్ రాములు మాట్లాడుతూ. రాష్ట్రంలో ఎల్ నినో వలన కరువు తీవ్రంగా ఉంటుందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాన్సువాడ నియోజకవర్గ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి కేంద్రానికి నివేదిక అందించి ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బాన్సువాడ మున్సిపాలిటీలో వర్తింపజేసి గ్రామాల లో ఉపాధి పనులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో సిపిఐ నాయకులు చెన్నం గారి సురేష్ , తోట శ్రీనివాస్, సాయిలు, ఖాదర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం