రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి

- సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కామ్రేడ్ నిమ్మల రాంబాబు
పాల్వంచ (కోతగుడెం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం (మొండికట్ట) సత్యనారాయణపురం లో కామ్రేడ్ కొంగర అప్పారావు అధ్యక్షతన జరిగిన సిపిఐ ముఖ్యుల సమావేశంలో, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కామ్రేడ్ నిమ్మల రాంబాబు మాట్లాడుతూ... ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా లేక పోవటం తో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పెంచుకున్న పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, వేరుశనగ తదితర పంటలు ఎండల తీవ్రతకు నిలువున ఎండిపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రతి రైతు వేసిన పంటలను సమగ్ర సర్వే నిర్వహించి పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మిరప పంటలకు ఎకరానికి 50వేల రూపాయల చొప్పున, పప్పు ధాన్యాల పంటలకు ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున, వరి పంటకు ఎకరానికి 40 వేల రూపాయలు చొప్పున రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేసారు.
50 సంవత్సరాలు నిండిన పేద రైతులందరికీ నెలకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని, వాగులు, కాలువలు, చెరువులు లాంటి నీటి వనరులను వినియోగంలోకి తెచ్చేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, రైతాంగ పంటలకు పంటల బీమా పథకం వర్తింపజేయాలని, రైతాంగ రుణాలు వెంటనే మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే రైతాంగ ధర్నాకు పాల్వంచ మండలంలోని అన్ని గ్రామాల నుండి, అన్ని వర్గాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కామ్రేడ్ వేములపల్లి శ్రీనివాసరావు, రైతు సంఘం మండల నాయకుడు కామ్రేడ్ చిల్లా కృష్ణ, ప్రజా సంఘాల నాయకులు:- కామ్రేడ్ అల్లి వెంకటేశ్వర్లు, కోరం శేఖర్, నిమ్మల మోహన్ రెడ్డి, వేముల నరేష్, సంపంగి నవీన్, ఓర్సు సారయ్య, బాదే చెన్నయ్య, విజయ్ కుమార్, గండికోట దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


