గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.లక్ష కర్పస్ ఫండ్ చెక్కు అందజేత
మెదక్, హవేలీ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎస్. రమేష్ సతీమణి స్వరూపకు రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) కర్పస్ ఫండ్ చెక్కును మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు జార్జ్, సందీప్ రెడ్డి, శైలేందర్, సూపరింటెండెంట్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


