ఆదిలాబాద్ రిమ్స్‌లో మళ్లీ విషాదం బాలింతతో పాటు ఇద్దరు కవల శిశువుల మృతి
బాలింతతో పాటు ఇద్దరు శిశువులు మృతి...దళిత జాక్ ప్రెసిడెంట్ కాంబ్లె ప్రజ్ఞశీల్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న మరణాల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని,నెల రోజుల క్రితం పసిపిల్లల మృతి ఘటన ప్రజలను కలచివేయగా, ఆ ఘటన మరువకముందే బాలింతతో పాటు ఇద్దరు కవల శిశువులు మృతి చెందిన ఘటన వెలుగులోకి రావడం హృదయవిదారకంమని అన్నారు . ఒకే కుటుంబంలో మూడు ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు కాగా, ఈ ఘటన ప్రభుత్వ వైద్య సేవలు, ఆసుపత్రి పర్యవేక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని అనుమానం వ్యక్తం చేసారు
మృతులు వెనుకబడిన ఆదివాసీ సమాజానికి చెందినవారు కావడం బాధాకరమన్నారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. పేద, ఆదివాసీ కుటుంబాలు వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యానికి గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం జరిగిందా? అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందాయా? తల్లి, శిశువుల ఆరోగ్య పరిస్థితిని తగిన విధంగా పర్యవేక్షించారా? అనే అంశాలు ప్రభుత్వంపై ఉందన్నారు.
రిమ్స్ డైరెక్టర్, సంబంధిత అధికారులు తమ పర్యవేక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లి-శిశు సంరక్షణకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, పరికరాలు, అత్యవసర చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసారు
బాలింతతో పాటు ఇద్దరు కవల శిశువుల మృతి ఘటన పై విచారణ జరపాలనీ డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


