యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట (నాగర్ కర్నూలు జిల్లా) : అచ్చంపేట నియోజకవర్గంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులను సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించడం కోసం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా అచ్చంపేట నియోజకవర్గంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పండ్లు చేపటం పెరుగుతుందన్నారు ఈ పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు పనులలో ఎలాంటి అవకతవకలు లేకుండా నాణ్యతవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు ఇంటర్నేషనల్ స్కూల్ భవన నిర్మాణ పనులు నాణ్యతగా నిర్మాణం చేయడంతో పాటు పనులు వేగవంతంగా చేయాలని అన్నారు కార్యక్రమంలో అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


