SIRపై అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలు వివరించాలి
— బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడా రమేష్
*లింగాలఘన్‌పూర్(జనగాం) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై వాస్తవాలను వివరించే కార్యక్రమాన్ని బీజేపీ లింగాలఘన్‌పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రముఖులను, ఓటర్లను కలిసి SIR ప్రక్రియపై చర్చించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడా రమేష్ మాట్లాడుతూ, SIR ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను వివరించి, అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పారదర్శకమైన ఓటర్ల జాబితా ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి ఓటరు తన ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా SIR ప్రక్రియకు సంబంధించిన వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గోరిగె సంపత్, కెమిడి నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శులు కోమరాజు సందీప్, కల్లే గణేష్‌తో పాటు నాయకులు మల్లేష్, కార్తీక్, సాయి, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


