దత్తపీఠంలో సుబ్రమణ్యం స్వామికి ప్రత్యేక పూజలు

తిరుచానూరు : తిరుచానూరు సమీపంలోని శ్రీదత్తాత్రేయపురంలో వెలసివున్న శ్రీదత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ప్రతిష్టించబడిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించినట్లు శ్రీదత్తాత్రేయ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రోఫెసర్ శేషయ్య తెలిపారు. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రమణ్యం స్వామికి, ప్రతి బుధవారం వినాయక స్వామికి అదేవిధంగా ప్రతి గురువారం శ్రీదత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో వాహన సమేత సతీ పరివారంగా దర్శనమిచ్చే నవగ్రహాల స్థాపన వుంటుందని, శ్రీదత్తాత్రేయ స్వామి వారి దర్శనంతో సకల శుభాలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త శేషయ్య వివరించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు సుబ్రమణ్యం, ఆలయ పిఆర్వో పుల్లయ్య, అర్చకులు వరప్రసాద్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

