శివ స్వాముల పై లాఠీచార్జి హేయం– VHP ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

శ్రీశైలం : శ్రీశైలం వంటి మహా శైవ క్షేత్రంలో దర్శనానికి వచ్చిన సాధూ సంతులు, భక్తులపై లాఠీచార్జి జరగడం చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన ఘటన అని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా “ఓం నమః శివాయ” అంటూ దర్శనం కోరిన భక్తులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా నిలుస్తోందని పేర్కొన్నారు. సోమవారం శ్రీశైలం మలన్న సన్నిధానంలో సాధూ సంతులు, శివ స్వాములపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం బాలస్వామి పత్రిక ప్రకటన విడుదల చేశారు.భక్తుల భద్రత, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైన అధికారులు – తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లాఠీలతో భక్తులను కొట్టడం అమానుషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పరిపాలనా తప్పిదం కాదు; హిందూ ధర్మాన్ని, భక్తుల ఆస్తిక భావాలను అణచివేసే దౌర్జన్య చర్య అని పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాలయం అన్నది పోలీసు శిబిరం కాదని, శివ స్వాములు, సాధూ సంతులు నేరస్తులు కాదని, పవిత్ర పుణ్య క్షేత్రంలో పోలీసులకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు.అయినా శ్రీశైలంలో భక్తులను శత్రువులుగా చూశారనీ, మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా లాఠీచార్జికి గురవడం రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తోందని విమర్శించారు. భక్తుల సహనాన్ని బలహీనతగా భావిస్తే అది పాలకుల అపోహ అని, హిందూ సమాజం ఇక మౌనంగా ఉండదని, ధర్మక్షేత్రాల్లో దౌర్జన్యం జరిగితే విశ్వహిందూ పరిషత్ నిశ్శబ్దంగా ఉండే ప్రశ్నే లేదని బాలస్వామి హెచ్చరించారు. లాఠీచార్జికి బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలనీ.. గాయపడిన భక్తులకు పూర్తి వైద్యసాయం, న్యాయమైన పరిహారం ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందన్నారు.లాఠీ ఛార్జీ ఘటన విషయంలోశ్రీశైలం దేవస్థాన నిర్వహణపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో భక్తులపై బలప్రయోగం జరగకుండా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ధర్మాన్ని అవమానిస్తే పోరాటం తప్పదనీ, భక్తుడి గౌరవం కోసం పోరాడటం మా కర్తవ్యమని బాలస్వామి పేర్కొన్నారు. రేపటి మహా శివ రాత్రిని దృష్టి లో ఉంచుకొని భక్తులకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికారులకు, పాలక మండలికి ఆయన సూచించారు.
భవదీయ
పగుడాకుల బాలస్వామి
ధర్మాచార్య సంపర్క ప్రముల్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

