రోడ్డుపై కేజీవిల్స్ ట్రాక్టర్... అధికారులు చూసినా నో రియాక్షన్

చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్–బొమ్మరెడ్డిగూడెం గ్రామాలను అనుసంధానించే డాంబర్ రహదారి భారీ లోడుతో సంచరిస్తున్న కేజీ విల్ ట్రాక్టర్ల రాకపోకల కారణంగా తీవ్రంగా దెబ్బతింటోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భారీ వాహనాల రాకపోకలతో రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఇప్పటికే దెబ్బతిన్న రహదారి మరింత అధ్వాన్నంగా మారిందని గ్రామస్తులు పేర్కొన్నారు. కురిసే వర్షాలకు గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు గుర్తించలేక ద్విచక్ర వాహన దారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.అధిక బరువుతో నిత్యం సంచరిస్తున్న ట్రాక్టర్ల వల్ల రహదారి ఆయుష్షు తగ్గిపోతోందని, ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారి కొద్ది కాలంలోనే దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు. సంబంధిత శాఖ అధికారులు పరిస్థితిని పరిశీలించి, అధిక లోడుతో వెళ్లే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సుల్తాన్‌పూర్–బొమ్మరెడ్డిగూడెం రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి, భారీ లోడుతో తిరిగే ట్రాక్టర్ల రాకపోకలను నియంత్రించాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. 
Views: 40

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి