వృత్తి కళాకారుల్ని ఆదుకోండి : జిల్లా అధ్యక్షులు

వృత్తి కళాకారుల్ని ఆదుకోండి : జిల్లా అధ్యక్షులు

 బాల్కొండ /నిజామాబాదు :  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీ సోమ క్షత్రియ నకఖాష్ వృత్తి కళాకారుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంక్షేమ సొసైటీ రాష్ట్ర సాధన సమరయోధుల గుర్తింపు పత్రాల సంఘం & తెలంగాణ రాష్ట్ర శ్రీ సోమ క్షత్రియ "నఖాష్" సంఘర్షణ సమితి అధ్యక్షులు బి. ఆర్. నర్సంగ్ రావు, సోమవారం హైదరాబాద్ లోని అమరవీరుల భవనంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యమ కారుల గుర్తింపు కే.కే కమిటీ (కేశవరావు కమిటీ) ముందు వివరిస్తు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా "శ్రీ సోమ క్షత్రియ (నఖాష్) కుల వృత్తి పనిముట్లతో రోడ్లమీద పనులు చేస్తూ ఉద్యమంలో పాల్గొన్నారని మాతో పాటు పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి కులాలకు చెందిన వారు కూడా పాల్గోన్నారని సభకు వివరించారు." శ్రీ సోమ క్షత్రియ (నఖాష్)" కులానికి చెందిన సాధారణ విద్య శిక్షణ,వ్యాయామ విద్యలో శిక్షణ పొందిన నిరుద్యోగులు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఆశతో రోడ్ల మీద కబడ్డీ, ఖో.. ఖో..వాలీబాల్ ఆడీ ఉద్యమంలో పాల్గొన్నారని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం డీ.ఎస్.సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయలేదని మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న నిరుద్యోగులను టీచర్ మరియు వ్యాయమ ఉపాధ్యాయుల్మి నియమిస్తూ నెలకు రూ 5000 రూపాయలు ఇచ్చి ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేయాలని విభజన చేస్తూ డీ. ఎస్. సి నిర్వహించా లని నర్సింగ్ రావు కమిటీ చేశారు.అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ." శ్రీ సోమ క్షత్రియ (నఖాష్ )"కులఓ వారందరితో పాటు ఉద్యమంలో పాల్గొన్న వివిధ కులాల వారందరికీ గుర్తింపు కార్డులతో పాటు, డబల్ బెడ్ రూములు నెల పెన్షన్ 250 గజాల ప్లాట్స్ ఇవ్వాలని కమిటీ కి సూచించారు. సోమవారం రోజు జరిగిన సమావేశంలో  బి. ఆర్. నర్సింగ్ రావు, డా, దాసరి పవన్ కుమార్,సత్వావె సంతోష్ కుమార్ తో పాటు నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల ఉద్యమ కారులు సుమారు 150 వరకు పాల్గొన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ లో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్,మోతె శోభన్ రెడ్డి సమావేశ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. 
 
Screenshot_20260720_174102_Gallery
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి