రాజకీయ పార్టీల నాయకులతో ప్రభుత్వ సమావేశం
మొత్తం 40 పార్టీల నుంచి 58 మంది నేతల హాజరు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ న్యూఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైంది. పార్లమెంటు భవన ప్రాంగణంలో కేంద్ర పార్లమెంటరీ, మ మైనారిటీ వ్యవహారాల శాఖల మంత్రి కిరణ్ రిజిజు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి (రాజ్యసభా నాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, శాసన-న్యాయశాఖ (స్వతంత్ర బాధ్యత) సహా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, అలాగే పార్లమెంటరీ వ్యవహారాలు-సమాచార-ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ కూడా ఇందులో పాల్గొన్నారు. మొత్తం మీద 40 రాజకీయ పార్టీల నుంచి 58 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తొలుత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నాయకులందరికీ స్వాగతం పలుకగా, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమావేశం నిర్వహించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 (సోమవారం) నుంచి ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలు, అవసరాల మేరకు ఆగస్టు 13న (గురువారం) సమావేశాలు ముగిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈసారి సమావేశాల వ్యవధి 25 రోజులు కాగా, 19 సమావేశ దినాలు ఉంటాయని ఆయన వివరించారు. అలాగే, వర్షాకాల సమావేశాల సంబంధిత శాసన కార్యకలాపాల వివరాలను రెండు పార్లమెంటు సచివాలయాలు ఈ నెల 16న ‘'బులెటిన్ పార్ట్-II’లో
హాజరై, అభిప్రాయాలను తెలపడంలో చురుగ్గా, సమర్థంగా వ్యవహరించిన నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చివరగా- పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఉభయ సభల్లో చర్చనీయాంశాలపై ఇవాళ తమ అభిప్రాయాలను వెల్లడించిన అన్ని పార్టీల నాయకులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
About The Author


