రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
భద్రాచలం : రోటరీ క్లబ్ 39వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షుడిగా షేక్ అజీమ్, కార్యదర్శిగా శ్రీనాథ్ రాజేష్, కోశాధికారిగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. వీరితో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శివనారాయణ ఇన్‌స్టాలేషన్ ఆఫీసర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ఐటీసీ యూనిట్ హెడ్ శైలేందర్ సింగ్ ముఖ్య అతిథిగా, పాకాల దుర్గాప్రసాద్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసిస్టెంట్ గవర్నర్ వెంకటరెడ్డి ఇన్‌స్టాలేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు షేక్ అజీమ్ మాట్లాడుతూ, జిల్లా గవర్నర్ సహకారంతో ఈ ఏడాది శాశ్వత ప్రజోపయోగ (పర్మినెంట్) ప్రాజెక్టులను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు వరలక్ష్మి, మాజీ కార్యదర్శి బాలకృష్ణ మహేంద్ర, హరి ప్రసన్న కుమార్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ పలివెల రవికుమార్, ప్రోగ్రామ్ చైర్మన్, పాస్ట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గుప్తా, యశోద రాంబాబు, వీరయ్య, అజయ్ కుమార్, నాగేశ్వరరావు, మునికేశవరావు, శ్రీమహాలక్ష్మి, వసంతరావు, మధు, చైతన్య, డా. సోమయ్యతో పాటు సభ్యులు చలపతి, సాగర్, శ్రీనివాసరావు, మోహనకృష్ణ, గ్లాడ్ స్టోన్, నరసింహారావు, శ్రీధర్ రెడ్డి, వంద వాసు తదితరులు పాల్గొన్నారు.
Views: 117
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
