గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభం
టేక్మాల్ : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యా బోధన అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ తరగతులను ప్రారంభించింది. టేక్మాల్ గిరిజన సంక్షేమ ఆశ్రమం పాఠశాలలో సోమవారం పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో 9వ 10వ తరగతులకు ఏర్పాటుచేసిన ఆన్లైన్ డిజిటల్ క్లాసులను స్థానిక తహసీల్దార్ తులసీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ... ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పాఠశాలకు రెండు టీవీలు అందజేయడం జరిగిందన్ని. ఈ డిజిటల్ తరగతుల వల్ల విద్యార్థులకు ఆధునిక సాంకేతికత ఆడియో వీడియో సులభమైన అభ్యాసం కష్టమైన సైన్స్ మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులను దృశ్యాల ద్వారా సులభంగా అర్థం చేసుకోగలుగుతారని అన్నారు. నాణ్యమైన విద్య మారుమూల ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు కూడా డిజిటల్ విద్యను అందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. అనంతరం తహసిల్దార్ పాఠశాల వసతి గృహాన్ని మధ్యాహ్న భోజనం ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదయ్య టీచర్లు సిబ్బంది. విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


