ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
- -బస్సులో పర్సు మరిచిన మహిళకు నగదు,
- విలువైన పత్రాలు తిరిగి ఇచ్చిన కండక్టర్.
- అభినందించిన తాండూరు డీఎం ప్రవీణ్ కుమార్
తాండూరు,(వికారాబాద్) : ఆర్టీసీ బస్సులో పర్సు మరిచి పోయిన మహిళ ప్రయాణికురాలుకు బస్ కండక్టర్ నిజాయితీతో తిరిగి ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డీపో పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన పుష్పలి శశికల తాండూరుకు వచ్చేందుకు తాండూరు–కొత్లాపూర్ బస్సులో బయల్దేరింది. బస్సుదిగే సమయంలో ఆమె తన పర్సును బస్సులోనే మరిచిపోయి దిగిపోయారు. విధులు నిర్వహిస్తున్న కండక్టర్ ఎన్. రవి పర్సును గమనించారు. వెంటనే తాండూరు డిపో అధికారులకు, భద్రతా సిబ్బందికి పర్సును అప్పగించారు. అనంతరం డిపో అధికారులు పర్సులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా ఫోన్ నంబర్‌ను గుర్తించి శశికళకు సమాచారం అందించారు. అందులో సుమారు రూ.5,000 నగదుతో పాటు విలువైన వ్యక్తిగత పత్రాలు ఉన్నాయి.తన పోగొట్టుకున్న పర్సును తిరిగి ఇప్పించినందుకు శశికళ కండక్టర్ ఎన్. రవికి, డిపో అధికారులకు, భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా బస్ కండక్టర్ నిజాయితిని చాటుకోవడం పట్ల డీపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ కండక్టర్ ను అభినందించారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
