రామవారంలో సింగరేణి డిస్పెన్సరీ పునఃప్రారంభం
కొత్తగూడెం, : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవారంలో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన సింగరేణి డిస్పెన్సరీని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు సోమవారం పునఃప్రారంభించారు. అనంతరం వీకేసీఎం ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు క్రేన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో డిస్పెన్సరీని ఆధునికీకరించి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కిరణ్ రాజ్ మాట్లాడుతూ, ఉద్యోగుల అవస రాలను దృష్టిలో ఉంచుకుని డిస్పెన్సరీలో నిరంతరం స్టాఫ్నర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన వైద్య సేవలు, మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు మాట్లాడుతూ, పునరుద్ధరించిన ఈ డిస్పెన్సరీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం వీకేసీఎం ప్రాజెక్టులో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు క్రేన్లను డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ క్రేన్ల వినియోగంతో గని నిర్వహణ పనులు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా సాగడంతో పాటు భద్రతా ప్రమాణాలు, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. భారీ యంత్ర పరికరాల తరలింపు, నిర్వహణ పనులు సులభతరం కావడంతో ఉత్పాదకతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఆధునికీకరణకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో వీకేసీఎం ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వి. నరసింహరావు, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, డీజీఎం (ఐఈడీ) యోహన్, ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ వంగా వెంకట్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, రామవరం కార్పొరేటర్ కె. జమలయ్య, ఎస్‌వో టు జీఎం ఎం. గోవిందరావు, సీఎంఓఏఐ జనరల్ సెక్రటరీ ఉపేందర్, పర్సనల్ మేనేజర్ తిరుపతి, ఇన్‌చార్జ్ హెచ్‌వోడీ (సివిల్) కె. రాజారాం, మేనేజర్ (ఐటీజీ) శేషశ్రీ, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ హరీష్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, ఐఎన్‌టీయూసీ ఫిట్ సెక్రటరీ సాగర్, అధికారులు, వైద్యాధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
