ఉపాధ్యాయులకు 3 రోజుల శిక్షణ ప్రారంభం.
చౌటకూర్ :తెలంగాణ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చౌటకూర్ మండలం కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల తెలుగు మాధ్యమం, ఇంగ్లీష్ మాధ్యమం ఉపాధ్యాయులకు మండల స్థాయిలో సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ (ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్) నిర్వహిస్తున్నట్లు చౌటకూర్ మండల వనరుల కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) మార్గదర్శకాల మేరకు ఈ శిక్షణను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత జూలై 20 నుంచి 22 వరకు, రెండో విడత జూలై 23 నుంచి 25 వరకు కొనసాగనుంది. ప్రతి మండలంలో మండల విద్యాధికారి (ఎంఈఓ) ఎంపిక చేసిన కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిం చబడుతుంది. దీనిలో భాగంగా చౌటకూర్ మండలంలోని ప్రతి పాఠశాల నుంచి ప్రతి విడతలో 50 శాతం మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీలు) హాజరైనారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే శిక్షణ పొందిన ప్రతి మండలం నుంచి నలుగురు మండల రిసోర్స్ పర్సన్లు (ఎంఆర్పీలు) ఇద్దరు తెలుగు, ఒకరు ఇంగ్లీష్, ఒకరు గణితం మండల స్థాయి శిక్షణలో వనరుల వ్యక్తులుగా సేవలందించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. శిక్షణ ప్రారంభానికి ఒక రోజు ముందే వేదికల వద్ద ప్రణాళిక సమావేశం నిర్వహించి, ఇంటరాక్టివ్ అయినారు.ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీలు)తో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి అని మండల వనరుల కేంద్రం అధికారిని అనురాధ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు, సి ఆర్ పి ఆంజనేయులు, వినయ్ కుమార్, ఉపాధ్యాయులు మరియు ఎంఇఓ అనురాధ పాల్గొనడం జరిగింది.
Views: 50
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
