మహిళల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి సాధ్యం

మహిళల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి సాధ్యం

మర్పల్లి (వికారాబాద్): గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, భూగర్భ జలాల పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమని ఎంపీడీవో శాంతమ్మ అన్నారు. సోమవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె మండలంలోని వివిధ గ్రామాల మహిళా సమాఖ్య సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి నిర్వహించాలని, పారిశుధ్య కార్యక్రమాల్లో మహిళలు ముందుండి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని, తాగునీటిని తప్పనిసరిగా మరిగించి, వడకట్టి వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పారిశుధ్యంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన "ఇంటికి ఒక ఇంకుడు గుంత – ఊరుకు ఒక ఊట కుంట – పంటకు ఒక పంటకుంట" కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ప్రతి బోరు వద్ద రీచార్జ్ పిట్ నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమాలను ఇంటింటికి చేరవేసి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మహిళా సమాఖ్య సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై కూడా మహిళలకు అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ దరఖాస్తులను సేకరించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయించి, మండల పురోగతి శాతాన్ని పెంచేందుకు మహిళా సమాఖ్య సభ్యులు తమ వంతు సహకారం అందించాలని ఎంపీడీవో శాంతమ్మ కోరారు.ఈ సమావేశంలో ఏపీఎం సమ్మయ్య, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రతినిధులు, గ్రామ సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 
Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి