శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం

శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం

తాండూరు, (వికారాబాద్ జిల్లా) తాండూరు లో శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ అట్టహాసంగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం రాత్రి తాండూరు పట్టణంలోని విలియమున్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పట్టణ ప్రజలతో పాటు చుట్టూ ప్రాంతాల సందర్శించి ఆదరించాలని సూచించారు. ఎగ్జిబిషన్ ఏర్పాటుతో పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కౌన్సిలర్లు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Views: 55

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం