అందుబాటులో లేని డాక్టర్, సమాచారం ఇవ్వని వైద్య సిబ్బంది
నాగర్‌కర్నూల్ : బిజినపల్లి బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చినా డాక్టర్అందుబాటులో లేకపోవడం,విధుల్లోఉన్నసిబ్బందిసరైన సమాచారం ఇవ్వకపోవడం తో రోగులు,వారి బంధువులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.డాక్టర్ ఎప్పుడు వస్తారో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయో కూడా సిబ్బంది చెప్పడం లేదని రోగులు వాపోతున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, PHC లో డాక్టర్ హాజరు,సిబ్బంది బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డాక్టర్ సృజనను ఫోన్లో సంప్రదించగా ఇప్పుడే బయటికి వచ్చాను అని సమాధానం ఇచ్చారు. ఇంకెప్పుడు సిబ్బంది ఇలాంటి నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వరని అన్నారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
