భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!

- తరచూ ఆస్తి తగాదాలతో  ఓపిక నశించిన భార్య..!

WhatsApp Image 2026-10-12 at 9.34.41 AM

- చనిపోయాడు అని తెలవగానే పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయిన భార్య  

హుస్నాబాద్,  అక్టోబర్ (విజన్ ఆంధ్ర) :  సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ మహరాజ్ తాండలో ఆదివారం రోజున జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. తాగి వచ్చి ఆస్తి కోసం గొడవకు దిగిన భర్త కళ్లల్లో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపింది భార్య. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేటతాండాకు చెందిన 43 ఏళ్ల బానోత్ భగవాన్ కు అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తాండాకు చెందిన మాలోతు రాజేశ్వరికి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. రాజేశ్వరికి రెండో పెళ్లికి ముందే ఓ కూతురుంది. ఆ కూతురుకు తన మొదటి భర్త ఆస్తిలో భాగంగా హన్మకొండలో ఓ ఇల్లుంది. ఇక రాజేశ్వరీ, భగవాన్ ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత.. వీరిద్దరికీ మరో కూతురు, కొడుకు జన్మించారు. అయితే, మొదటి భర్త ఆస్తిలో ముగ్గురికీ సమానం పంచాలని భగవాన్ పట్టుబట్టడంతో భార్యా, భర్తలైన రాజేశ్వరి, భగవాన్ మధ్య తరచూ గొడవలవుతున్నాయని తెలిసింది. ఈ క్రమంలో తల్లిగారింటికి వచ్చిన రాజేశ్వరి దగ్గరకు సేవాలాల్ మహారాజ్ తాండాకు తాగి వచ్చిన భగవాన్ మళ్లీ గొడవకు దిగాడని, దాంతో ఓపిక నశించిన భార్య రాజేశ్వరి కళ్లల్లో కారం చల్లి, చెట్టుకు కట్టేసి విపరీతంగా కొట్టి భర్తను చంపేసిందని, భర్త చనిపోయినట్టు అనుమానం రాగానే ఆమే నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయింది. వెంటనే హుస్నాబాద్ సీఐ శ్రీధర్, అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు భగవాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హుస్నాబాద్ తరలించారు.

 

Views: 226

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత