తాంసీ మండలం లోని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన.... ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు 

తాంసీ మండలం లోని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన.... ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు 

 

ఆదిలాబాద్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రతిష్టాత్మకంగా  నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ, కల్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను తాంసి మండల కేంద్రంతో పాటు బండల్ నాగపూర్ గ్రామంలో నేడు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి  పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లబ్దిదారులకు సంబంధిత చెక్కులను పంపిణీ చేసి శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడుతూ పేదింటి సొంతింటి కల సాకారం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి  సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇళ్లను నిర్మిస్తూ వారి కళ్ళల్లో ఆనందం నింపుతోందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ, బండల్ నాగపూర్ సర్పంచ్ పుష్ప, హౌసింగ్ ఏఈ నషీర్,  హౌసింగ్ డీఈ రమేష్,  ఎంపిడివో మోహన్ రెడ్డి, తాంసి ఎమ్మార్వో మధుసూదన్,  తలమడుగు ఎమ్మార్వో రాజేష్ మోహన్ ,మార్కెట్ కమిటీ మెంబెర్ ధనుంజయ్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత