పనిమనిషి అంతకురాలు...

ఇంటి పనిమనిషి ముసుగులో 8 తులాల బంగారు ఆభరణాలు చోరీ అపై హత్య 

పనిమనిషి అంతకురాలు...


కామారెడ్డి బ్యూరో :పనిమనిషి ముసుగులో దొంగతనాలు విచారణలో గతనేర చరిత్ర బట్టబయలు..గతంలోనూ ఇంట్లో బంగారం చోరీ!కేసును చాకచక్యంగా ఛేదించిన కామారెడ్డి పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర,కామారెడ్డి పట్టణంలోని ముష్రీబ్‌బాగ్‌కు చెందిన చిట్మల్ అనసూయ (66) ను తేదీ 29.09.2026న సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల మధ్య హత్య చేసి, ఆమె ధరించిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త తిరిగి వచ్చేసరికి అనసూయ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. ఆమె మెడపై గాయాల గుర్తులు ఉండటంతో పాటు, బంగారు పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా  కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు హత్య, దోపిడి  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్  పర్యవేక్షణలో పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. నరహరి తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సాంకేతిక సమాచారం, ఇతర దర్యాప్తు వివరాలను విశ్లేషిస్తూ నిందితుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు.దర్యాప్తులో భాగంగా మృతురాలి ఇంట్లో గత కొంతకాలంగా పనిమనిషిగా పనిచేస్తున్న రజితపై అనుమానం రావడంతో పోలీసులు ఆమె ప్రతీ కదలికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో రజిత, ఆమె భర్త నర్సింగ్‌లను గంజ్ పాఠశాల సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించగా, నేరానికి సంబంధించిన వివరాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.- పక్కా పథకంతో హత్య చేసి ఆభరణాలు దోపిడీపోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దురాలోచనతో రజిత, నర్సింగ్‌లు మృతరాలి అనసూయ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించాలని పథకం వేసుకున్నారు. అయితే, తమను అనసూయ గుర్తుపట్టే అవకాశం ఉండటంతో ఆమెను హత్య చేసి ఆభరణాలను దోచుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
పథకం ప్రకారం, 29.09.2026న అనసూయ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో అనసూయ ఒక్కతే ఇంట్లో ఉంది అని రజిత తన భర్త నర్సింగ్‌తో కలిసి అనసూయ ఇంట్లోకి ప్రవేశించారు.  అనసూయ పూజ చేస్తుండగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఆమెను కింద పడేసి మరో గదిలోని ఈడ్చుకెళ్లారు.  అనంతరం ఒక తువ్వాలుతో గొంతుపై గట్టిగా బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె మరణించినట్లు నిర్ధారించుకున్న అనంతరం, ఆమె ధరించిన బంగారు పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి ఆభరణాలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. నేరంపై అనుమానం రాకుండా రజిత యథావిధిగా అనసూయ ఇంట్లో పనులకు వెళ్ళి వచ్చినట్లుగా నటించారని విచారణలో వెల్లడైంది. గతంలోనూ మరో ఇంట్లో చోరీ విచారణలో రజిత గతంలో కామారెడ్డిలోని భూమయ్య ఇంట్లో పనిమనిషిగా పనిచేసిన సమయంలోనూ బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు తెలిపారు. 2023 సెప్టెంబర్‌లో ఇంటి యజమాని బయటకు వెళ్లగా, ఆయన భార్య తమ కుమార్తెను రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కించేందుకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరులేరని సుమారు 4 తులాల బంగారు పుస్తెల తాడు, 5 గ్రాముల బంగారు చెవి కమ్మలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.
నిందితుల వివరాలు 1)  బోసు రజిత, భర్త: నర్సింగ్ (40), నివాసం: బతుకమ్మ కుంట, కామారెడ్డి. 2)  బోసు నర్సింగ్, తండ్రి: యాదయ్య,(48) నివాసం: బతుకమ్మ కుంట, కామారెడ్డి. స్వాధీనం చేసుకున్న సొత్తు1)    బంగారు పుస్తెల తాడు (మంగళసూత్రం).2) రెండు బంగారు ఉంగరాలు. 3) చెవి ఆభరణాలు.(మొత్తం సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు 4)   నిందితురాలి సెల్‌ఫోన్. ఈ కేసులో నిందితులైన భార్యాభర్తలు ఇద్దరిని  రిమాండ్ నిమిత్తం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు.ఈ కేసును ఛేదించడంలో సమర్థవంతంగా పనిచేసి, నిందితులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన కామారెడ్డి పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. నరహరి, ఏఎస్ఐ రంగారావు, పోలీస్ కానిస్టేబుళ్లు రామస్వామి, రాజు నాయక్, సంపత్‌లను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, అభినందించారు. వారి విధి నిర్వహణ, అంకితభావం, ప్రతిభను ప్రశంసించారు.

Views: 35

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత