మృతుని కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం
నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కత్తుల రాజేష్(35) మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.ఈ నేపథ్యంలో గ్రామస్తులు, యువత మానవత్వాన్ని చాటుకున్నారు. మృతుని కుటుంబానికి అండగా నిలుస్తూ గ్రామస్తులు, యువత కలిసి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. రాజేష్‌కు భార్యతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఆపద సమయంలో ఆర్థిక సాయం అందించడం పట్ల పలువురు గ్రామస్తులు యువతను అభినందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.
Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
12 Oct 2026 20:26:22
విజయవాడ : విజయవాడ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
