సెల్​ఫోన్​ కోసం స్నేహితుడిని  బండరాయితో కొట్టి హత్య

సెల్​ఫోన్​ గొడవ ఒకరి ప్రాణం తీసింది.

 

నిజామాబాద్ :సెల్​ఫోన్​ గొడవ ఒకరి ప్రాణం తీసింది.. ఈ ఘటన నగరంలోని మూడో టౌన్​ పరిధిలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో సెల్​ఫోన్​ కోసం..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మూడో టౌన్ పరిధిలో  న్యూ ఎన్జీవోస్ కాలనీ ప్రాంతంలో నివాసముండే గంగోని వినోద్, అతడి స్నేహితుడు జయంత్ స్నేహితులు. అయితే ఈనెల 8వ తేదీన తెల్లవారుజామున మద్యం మత్తులో ఉండగా సెల్‌ఫోన్ విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో జయంత్​ బండరాయితో గంగోని వినోద్​ తలపై కొట్టడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని నిజామాబాద్​ జీజీహెచ్​కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ అక్కడ చికిత్స పొందుతూ 11వ తేదీ ఆదివారం మృతి చెందాడు. మూడో టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత