అంగరంగా వైభవంగా గద్వాల్ లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం

షాపింగ్ మాల్ ను ప్రారంభించిన  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

అంగరంగా వైభవంగా గద్వాల్ లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం

 

 

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ వస్త్ర వ్యాపార దిగ్గజ సమస్త అయినా చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హాజరై షాపింగ్ మాల్ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి చెన్నై షాపింగ్ మాల్ యజమాన్యానికి మీ షాపింగ్ మాల్ ను మా నియోజకవర్గంలో ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మీ యొక్క షాపింగ్ మాల్ లో అందరుకు అందుబాటులో ఉన్న ధరలతో, ఉత్తమ నాణ్యతతో మా జిల్లా ప్రజల మన్ననను పొందగలరని ఆశిస్తున్నాను. మీ యొక్క షాపింగ్ మాల్ దినదినాభివృద్ధి చెందాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు షాపింగ్ మాల్ యాజమాన్యం ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంకు మా ఆహ్వానం మేరకు వచ్చి మా షాపింగ్ మాల్ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని యజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 378

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత