ఆదిలాబాద్ జిల్లా న్యూ రాంపూర్ గ్రామ విడిసి సభ్యులు, బెల్ట్ షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు

బెల్ట్ షాపు నిర్వహణకు రూ.50 వేలతో వేలం నిర్వహణ , బెల్ట్ షాపు నుంచి రూ.17 వేల విలువైన మద్యం స్వాధీనం

 ఆదిలాబాద్ జిల్లా న్యూ రాంపూర్ గ్రామ విడిసి సభ్యులు, బెల్ట్ షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు

 

ఆదిలాబాద్ బ్యూరో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ రాంపూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రామ విడిసి  ఏర్పాటు చేసి, దాని ద్వారా బెల్ట్ షాపు నిర్వహణకు రూ.50 వేలతో వేలం నిర్వహించిన వ్యవహారంలో విడిసి సభ్యుడు శాలికిరావు మరియు మరికొందరిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్ తెలిపారు. అదేవిధంగా, వేలం ద్వారా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఆనందరావుపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. పోలీసులు బెల్ట్ షాపుపై చర్యలు చేపట్టి, సుమారు రూ.17 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గ్రామ విడిసిలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమంగా మద్యం విక్రయాలకు లేదా అక్రమ ఇసుక రవాణాకు వేలం నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత