జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ లో సత్తా చాటిన అకిరానంద్..
బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడి ని అభినందించిన అజీజ్ ఖాన్.
హన్మకొండ న్యూస్ : హనుమకొండ జిల్లాకు చెందిన శ్రీనివాస రామానుజన్ హైస్కూల్ విద్యార్థి, బాల్ బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు అకిరానంద్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాడు. అక్టోబర్ 03/2026-07/2026 వరకు వరకు చత్తీస్గడ్ లోని బిలాస్ లో జరిగిన జాతీయ క్రీడోత్సవాలలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు .డబుల్స్ విభాగంలో తృతీయ స్థానం సాధించడంతో పాటు, జట్టు విభాగంలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సోమవారం రోజు ఉదయం హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, గ్రంధాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అకిరానంద్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు. అకిరానంద్ సాధించిన విజయాలు పాఠశాలకు, జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.ఈ అభినందన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కార్యదర్శి రడం శ్రీనివాస్, పీఈటీ తిరుపతిరెడ్డి, శ్రీనివాస రామానుజన్ హైస్కూల్ ఇన్‌చార్జి భాస్కర్, అకిరానంద్ తండ్రి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


