కాఫెడ్ గ్రౌండ్లో ప్రీమియర్ లీగ్ సీజన్ 03 ప్రారంభించిన వెంకటాపురం సీఐ ముత్యం రమేష్
మొదటి బహుమతిగా 55,555 రూపాయలు

వెంకటాపురం (ములుగు జిల్లా) వెంకటాపురం మండల కేంద్రము లో కాఫెడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ 03 ను వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా
సీఐ ముత్యం రమేష్ మాట్లాడుతూ క్రీడలు వ్యక్తిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడతాయని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు.. యువత ఎవరు చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలు దోహదపడతాయని అన్నారు.
ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 55,555 రూపాయలు, ద్వితీయ బహుమతి 33,333 రూపాయలు, తృతీయ బహుమతి 22,222 రూపాయలు, నాలుగో బహుమతిగా 11,111 వేల రూపాయలు అందజేయనున్నారు... ఈ కార్యక్రమంలో ఎస్సై కొప్పుల తిరుపతిరావు, వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి సరస్వతి, పిఎసిఎస్ చైర్మన్ చిడేం మోహన్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, మన్యం సునీల్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు ముడుంబా శ్రీను , ప్రీమియర్ లీగ్ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


