తలమడుగు మండలాన్ని కరువు మండలము గా ప్రకటించండి.....
..ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల ఆదివాసి సంఘాల తరఫున తలమడుగు తహిసిల్దార్ ను కలిసి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్ నీ నో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పంటలు సరిగ్గా పండగ పోవడంతో అప్పుల పాలు అయ్యారు కావున రైతుల బ్యాంకు ద్వారా తీసుకున్న పంట రుణాలను, ఇటీవల అప్పులతో ఆత్మహత్య చేసుకున్న రైతులను ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని, తలమడుగు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ, ఆదివాసి సంక్షేమ పరిషత్ తలమడుగు వివిధ గ్రామాల పటేల్ మహాజన్, దేవారి, సర్పంచ్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షు లు కుమ్ర జ్ఞానేశ్వర్, మండల అధ్యక్షులు జంగాల పోచన్న ,మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం భుజంరావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ కార్యదర్శి ఆత్రం అంకుష్, ఝ రి సర్పంచ్ రూపా కాశిరాం, పేందూరు జైతు పటేల్, పెందూర మాధవరావు మహాజన్, నైతం రాము పటేల్, నైతం లక్ష్మణ్, సలాం రవీందర్, మెస్రం దేవరావు పటేల్, కోవా గోవిందరావు, మాజీ సర్పంచ్ మెస్రంవిలాస్, సూర్య బాన్, సోయంమాణిక్ రావు, తుడసం హేమంత్, పేందూరు రాము, తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


