పత్తి పంటలో గంజాయి సాగు.. 50 గంజాయి మొక్కలు స్వాధీనం
తలమడుగు మండలం అర్లి గ్రామ శివారులో ఘటన గంజాయి మొక్కల విలువ సుమారు రూ.5 లక్షలు ,నిందితుడిపై తలమడుగు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, అరెస్టు, రిమాండ్*.... ఎస్ఐ డి రాధిక
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని తలమడుగు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 50 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా. విశ్వసనీయ సమాచారం మేరకు తలమడుగు ఎస్ఐ డి. రాధిక పోలీసు సిబ్బందితో కలిసి అర్లి గ్రామ శివారులోని అనుమానిత వ్యవసాయ భూమిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పత్తి పంట మధ్యలో అక్కడక్కడ గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు.
*నిందితుడి వివరాలు:*
చింతలపల్లి రాజారెడ్డి (65), s/o చింతలపల్లి వెంకటరెడ్డి, అర్లి గ్రామం, తలమడుగు మండలం.
నిందితుడు తనకు చెందిన సర్వే నంబర్ 62/A/1లోని 2 ఎకరాల 23 గుంటల వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి మొక్కలు సాగు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సుమారు 50 గంజాయి మొక్కలను పెంచినట్లు తెలిపాడు.
పోలీసులు పంచుల సమక్షంలో 50 గంజాయి మొక్కలను లెక్కించి, వాటికి నంబర్లు వేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడిపై కేసు నమోదు చేసి, నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
ప్రభుత్వ నిషేధిత గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తలమడుగు ఎస్ఐ డి. రాధిక తెలిపారు. అక్రమ గంజాయి సాగు, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే 8412659973 నంబర్ కు వాట్స్అప్ ద్వారా తెలియజేయాలని ఈ నెంబర్ జిల్లా ఎస్పీ గారిచే నిర్వహించబడుతుందని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని గంజాయికి దూరంగా ఉంటూ గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి, యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


