మున్సిపల్, విద్యుత్ ఏఈ లను సస్పెండ్ చేయాలి..!
బతుకమ్మ టెండర్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలి !

- పచ్చిమట్ల రవీందర్ గౌడ్ (BSP పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్)
హుస్నాబాద్ (సిద్దిపేట) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరిగిన శనివారం రోజున జరిగిన ఎంగిలి బతుకమ్మ పండుగ వేడుకలలో హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 200 ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారని,బతుకమ్మ పండుగ దుర్గాష్టమి షమీ పూజకు సంబంధించి వివిధ సౌకర్యాల కొరకు డెకరేషన్ కొరకు మున్సిపల్ శాఖ 12 లక్షల 50 వేల టెండర్ నిర్వహించిందన్నారు. సదరు కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం నిన్న జరిగిన చిన్న బతుకమ్మ పండుగకు సంబంధించి విద్యుత్ శాఖ కరెంటు వైర్లకు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి ఎటువంటి డీడీలు కట్టకుండా, విద్యుత్ శాఖ పర్మిషన్ తీసుకోకుండా కరెంటు చోరీకి పాల్పడడం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు. అదేవిధంగా మున్సిపల్ కరెంటు పోల్ వైర్లకు కూడా ఫ్లడ్లైట్లకు సంబంధించి కరెంట్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉండగా మున్సిపల్ శాఖ పర్మిషన్ లేకుండా కరెంటు చోరీ సదర్ కాంట్రాక్టర్ చేయడం జరిగిందన్నారు. ఇట్టి విషయంలో మున్సిపల్ కమిషనర్ మరియు హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈలు విచారణ జరిపి సదరు కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని అదే విధంగా నిన్న ఎంత కరెంటు దుర్వినియోగం జరిగిందో దానికి సంబంధించి కేసు ఫైల్ చేయాలని బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.వ్యవసాయానికి పది నిమిషాలు కూడా ఎక్కువ కరెంటు ఇవ్వని విద్యుత్ శాఖ, ఒకవైపు కరెంటు కోతలతో పంటలు ఎండబెడుతున్న ప్రభుత్వం కానీ నిన్న హుస్నాబాద్ మున్సిపాలిటీలో జరిగిన బాధ్యత రహితమైన కరెంటు చోరీకి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ప్రశ్నించారు.వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బిఎస్పి పార్టీ పక్షాన కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


