గీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఉండాలి

: ముదిగొండలో ఎక్సైజ్ అధికారుల ప్రత్యక్ష పరిశీలన

గీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఉండాలి

 

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముదిగొండ గ్రామంలోని యువ గీత కార్మికులందరికీ గౌడ సంఘం (గీత కార్మిక) గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని గౌడ సంఘం పెద్దల విజ్ఞప్తిపై ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఈ మేరకు సోమవారం కొండపల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్సై వెంకన్న చందు ఆధ్వర్యంలో అధికారులు ముదిగొండ గ్రామాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా గుర్తింపు కార్డులు లేని యువ కార్మికులతో అధికారులు సమక్షంలో తాటి చెట్లు ఎక్కించి వారి నైపుణ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం వారి వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ సహాయం అందుతుంది:
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై వెంకన్న చందు మాట్లాడుతూ, తాటి చెట్లు గీసే ప్రతి ఒక్కరికీ ఈ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి ఏదైనా జరిగితే, ఈ కార్డు ఉండటం వల్ల ప్రభుత్వం నుండి లభించే ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా మరియు ఇతర సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని అవగాహన కల్పించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్ద గౌడ్ మల్లారపు వేలాద్రి, మల్లారపు శ్రీనివాస్, యూత్ లీడర్ మల్లారపు ఉపేందర్, బుర్ర శ్రీనివాస్, బూరుగు శీను, బుర్ర ధర్మయ్య, బుర్ర వీరబాబు, నాయిని వెంకటేశ్వర్లు, మల్లారపు వెంకటేశ్వర్లు, మల్లారపు రోశయ్య, గంధసిరి గోపయ్య, బుర్ర సాయి, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు మరియు గౌడ కులస్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత