కోర్పోల్ గ్రామంలో చెరువు భూమి ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు

చెరువు కట్టపైకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలి: బీజేపీ మాజీ మండల ఉపాధ్యక్షుడు వడ్ల సుధాకర్ చారి

కోర్పోల్ గ్రామంలో చెరువు భూమి ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు

 

: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోల్ గ్రామంలోని వడ్లొని కుంట చెరువు వద్ద భూమి ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ బీజేపీ మాజీ మండల ఉపాధ్యక్షుడు వడ్ల సుధాకర్ చారి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చెరువు భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించడంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోతోందని, చెరువు కట్టపైకి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.చెరువు భూమి ఆక్రమణల కారణంగా చెరువు పరిరక్షణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెరువు కట్టపైకి వెళ్లేందుకు వీలుగా దారి ఏర్పాటు చేయడంతో పాటు, చెరువు భూమి ఆక్రమణకు గురవుతున్న అంశంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు.ఈ సమస్యను పరిష్కరించి, చెరువు భూమిని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వడ్ల సుధాకర్ చారి అధికారులకు వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులు స్పందించి, చెరువు భూమి హద్దులను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చెరువు కట్టపైకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Views: 181

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత