కొండపాక మండల కేంద్రంలో ఆయుర్వేదిక్ ఆసుపత్రి సిబ్బంది ఎక్క ఎక్కడ?
ఆరు నెలల నుండి ఆసుపత్రికి తాళం
సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల కొండపాక మండలం గత 25 సంవత్సరాల నుండి ఆయుర్వేదిక వైద్యశాల ద్వారా చాలామందికి చికిత్స అందించే హాస్పిటల్ మూతబడి ఆరు మాసాలు గడుస్తున్న డాక్టర్ ట్రాన్స్ఫర్ అయినా తరువాత ఫార్మసిస్ట్ కూడా రావడం లేదు. గతంలో స్వీపర్ ఉండే వరకు ఆసుపత్రి రోజు తీసి ఉండేది కానీ ఆమె మరణించిన ఆస్పత్రి కూడా తీయడం లేదని ప్రజలుఅనుకుంటున్నారు ప్రస్తుతానికి తాళం వేసింది. రోగులు వచ్చి పోతున్నారు కానీ తాళం తీయడం లేదు ఆసుపత్రి తీసేసారా ఉందా అన్న సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు గతంలో ఉన్న రజిని అనే డాక్టర్ ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్ ఆమె డిప్టేషన్ పై సిద్దిపేట వెళ్లినట్లు సమాచారం . ప్రస్తుతానికి తాళం వేసి మూసి ఉంది. కలెక్టర్ గారు పలుమార్లు ప్రభుత్వఆస్పత్రి చెకింగ్వస్తున్నారు కానీ ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు ఇకనైనా వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ ఆస్పత్రిని వెంటనే తిరిగి పునః ప్రారంభించాలని కోరుతున్నారు .
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


