రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తాగు, సాగు నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆదిలాబాద్ ఎల్ నినో వాతావరణం పరిస్థితులను అధిగమించేందుకు రైతులు అధైర్యపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, సంబంధిత అంశాలపై సోమవారం హైదరాబాద్ నుండి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు  కీలక సూచనలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదిలాబాదు గ్రామీణ మండలం యాపల్ గూడ రైతువేదిక నుండి జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులు, రైతులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో జలాశయాల్లో, చెరువుల్లో నీటి మట్టాలు తగ్గే సూచనలు ఉన్నందున రైతులు అధైర్యపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటల కంటే, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటలు (వరికి బదులుగా ఆయిల్ పామ్, పత్తి, మినుములు, పెసర్లు, వేరుశనగ, కందులు వంటి పంటలు) సాగు చేయడం శ్రేయస్కరమని స్పష్టం చేశారు. బోరుబావులు, బావుల కింద మాత్రమే ఆధారపడి ఎక్కువగా వరి సాగు చేసే రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, రుణాలు, డ్రిప్ పరికరాలను ప్రాధాన్యతా క్రమంలో సిద్ధంగా ఉంచాలని వ్యవసాయాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, వాతావరణ సలహాలకు అనుగుణంగా సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వేళలా రైతులకు అండగా ఉంటుందని, అధికారుల సూచనలు పాటిస్తూ నీటి కొరత ముప్పు నుంచి పంటలను కాపాడుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. మండలాల వారీగా నీటి లభ్యత, వాతావరణ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, బిందు, తుంపర సేద్యం వంటి ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులను వినియోగించి ప్రతీ నీటి బొట్టును సమర్థవంతంగా వాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తాగు, సాగు నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని భరోసా కల్పించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యవసాయాధికారుల సలహాలతో నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు. జిల్లా యంత్రాంగం రైతుల వెంటే ఉంటుందని, ప్రతి రైతుకు అవసరమైన సాంకేతిక సహకారం, సలహాలు అందించేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, పంచాయతీ అధికారి రమేష్, మండల అగ్రికల్చర్ అధికారి నాగేష్ రెడ్డి, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత