ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!

Untitled

విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టిన ఘటనలో నలుగురు సజీవ దహనం అయ్యారు. రెయిలింగ్‌ను డీ కొనటంతో కారులోని బ్యాటరీ వ్యవస్థలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవదహనమయ్యారు. మరొకరు పరిస్తీతి విషమంగా వుంది.  ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, అగ్నిమాపక రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే నలుగురు కాలిబూడిదయ్యారు. చనిపోయినవారిలో కొమ్మారెడ్డి రాందేవ్, కొమ్మారెడ్డి అరుణ (రాందేవ్ తల్లి), ఒక చిన్నారి,  విజయ ఉన్నారు. వాహనం మితిమీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని విజయవాడ పోలీసులు తెలిపారు. వాహనం వేగంగా రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఈవీ కారు బ్యాటరీ బ్యాక్‌పై తీవ్రమైన ప్రభావం పడి, క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

 

 

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత