శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు : మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి
.jpeg)
మేడిపల్లి / భీమారం : మేడిపల్లి భీమారం మండల ప్రజలకు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించేవారు తప్పనిసరి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో అనుమానితులు కనిపించినట్లయితే మీ గ్రామ పోలీస్ అధికారికి గాని,112 కి గాని కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. గణేష్ విగ్రహాల ఏర్పాట్ల సందర్భంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారో అదే విధంగా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డీజేలకు అనుమతి లేదని తెలిపారు. పండుగ సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బతుకమ్మ వేడుకలలో భాగంగా మహిళలకు ఇబ్బంది కలిగిస్తే కేసు నమోదు చేస్తామని, దసరా పండుగ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


