ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.....

WhatsApp Image 2026-10-11 at 7.09.21 AM

  • పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్ 

పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రధాన ఆలయం నుంచి గోకుల్ షెడ్ వరకు బాజా భజంత్రీలతో ఊరేగింపుగా తీసుకు వచ్చి మంటపంలో ప్రతిష్టించిన అనంతరం అమ్మవారికి నవరాత్రుల ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల సందర్భంగా మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, ఈఓ మఠం వీరేశం పట్టు వస్త్రాలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

WhatsApp Image 2026-10-11 at 7.09.21 AM (1)

నవరాత్రుల సందర్భంగా ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక మంటపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజారులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంపేట నరేందర్ గౌడ్, మాజీ ఎంపీపీ పీ. చందన ప్రశాంత్ రెడ్డి, మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్.మల్లప్ప, అప్పాజీపల్లి సర్పంచ్ గజిని, నాయకులు ముషెట్టి కిష్టయ్య, ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, దీపక్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ఏడుపాయ ల్లో భక్తులకు అన్న ప్రసాదం కల్పించారు. ఏడుపాయల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

WhatsApp Image 2026-10-11 at 7.09.22 AM

 

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..... ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.....
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్  పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
నూతన న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ పుస్తకం ఎంతో ఉపయోగకరం..
మున్సిపల్, విద్యుత్ ఏఈ లను సస్పెండ్ చేయాలి..!
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
ప్రార్థనా మందిర అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన ఉప సర్పంచ్ రఫిక్
బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి..  
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..