ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసిన - మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ సర్పంచ్ ఐరెని నరసయ్య.
కామారెడ్డి బ్యూరో : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సోమవారం ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై నర్రాగుల లావణ్య శ్రీనివాస్ దంపతులకు నూతన వస్త్రాలను మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ సర్పంచ్ ఐరెని నరసయ్యలు అందజేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సహకారంతో దోమకొండ మండలానికి 122 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. దోమకొండ 44 అంబర్పేట్ 20 అంచనూర్ 5 చింతామణి పల్లి 6 గొట్టుముక్కల 6 లింగు పల్లి 3 ముత్యంపేట్ 21 సంగమేశ్వర్ 17 మంజూరైనట్లు వివరించారు కార్యక్రమంలో దోమకొండ సింగిల్ విండో చైర్మన్ అనంతరెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీతారాo మదు ఇందిరమ్మ కమిటీ సభ్యులు నర్సింలు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


